Skip to main content

Namaste NRI

న్యూయార్క్, న్యూజెర్సీలో ఐడా బీభత్సం

అగ్రరాజ్యం అమెరికాను హెన్రీ తుపాను దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్‌ విరుచుకుపడిరది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, రాష్ట్రాల్లో ఐడా తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రాష్ట్రాలు జలమయం అయ్యాయి. 14 మంది చనిపోయారు. రవాణా సేలను పూర్తిగా నిలిపివేశారు. న్యూయార్క్‌ నగరంలో ఓకే ఇంట్లో ముగ్గురు చనిపోగా వీరిలో రెండేండ్ల బాలుడు ఉన్నాడు. భారీ వర్షాలతో న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో రోడ్లు, సబ్‌వేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.

                నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ మొట్ట మొదటి సారి ఆకస్మిక వరద హెచ్చరికలను జారీ చేసింది. న్యూయార్క్‌లో ఒక్క గంటలోనే 9 సెంటీమీటర్ల వాన కురిసింది. తుఫాను క్రమంగా న్యూ ఇంగ్లండ్‌ వైపు కదులుతున్నది. ఈ క్రమంలో భారీ టోర్నడోలు సంభవించవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News