Namaste NRI

అమెరికా మాపై దాడి చేస్తే.. మరో ఆలోచన లేకుండా భారత్‌పై

పాక్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ అణు కార్యక్రమం లక్ష్యంగా ఒకవేళ అమెరికా దాడి చేస్తే పాక్‌ వెంటనే ఢిల్లీ, ముంబైలపై బాంబులు వేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికా ఒక వేళ మాపై దాడి చేస్తే మరో ఆలోచన లేకుండా భారత్‌పై దాడి చేస్తామని పేర్కొన్నారు.

అమెరికాపై తమపై దాడి చేస్తే గల్ఫ్‌లోని ఆ దేశ స్థావరాలు, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకోవడం తమకు కష్టమవుతుందని, ఈ క్రమంలో భారత్‌పై దాడి చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని ఆయన అన్నారు. భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు క్లిష్టంగా ఉన్న 2014-2017 మధ్య కాలంలో బాసిత్‌ భారత్‌లో పని చేశారు. ఆయన గతంలో నిర్వహించిన హైకమిషనర్‌ పదవి కారణంగా ఆయన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events