ఎవరైనా తమను రెచ్చగొడితే అణు దాడికి సిద్ధమేనని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తేల్చి చెప్పారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయుధాల పరేడ్ నిర్వహించారు. ఈ ఆయుధ ప్రదర్శనలో దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన, ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించారు. సైనిక దుస్తులైన తెలుపు రంగు కోటు వేసుకున్న కిమ్ భార్య రిసోల్ జూతో కలిసి పరేడ్‌ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధాన్ని అరికట్టడమే మా మొదటి లక్ష్యం అన్నారు. మా దేశ ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలగజేస్తే అణ్వాయుధాలతో ఎదురు దాడి చేయడం మా రెండో లక్ష్యమవుతుంది అని అన్నారు.