Skip to main content

Namaste NRI

ఎవరైనా తమను రెచ్చగొడితే.. అణుదాడులే

ఎవరైనా తమను రెచ్చగొడితే అణు దాడికి సిద్ధమేనని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తేల్చి చెప్పారు.  ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయుధాల పరేడ్‌ నిర్వహించారు. ఈ ఆయుధ ప్రదర్శనలో దేశానికి చెందిన అత్యంత శక్తిమంతమైన, ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించారు. సైనిక దుస్తులైన తెలుపు రంగు కోటు వేసుకున్న కిమ్‌ భార్య రిసోల్‌ జూతో కలిసి పరేడ్‌ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యుద్ధాన్ని అరికట్టడమే మా మొదటి లక్ష్యం అన్నారు. మా దేశ ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలగజేస్తే అణ్వాయుధాలతో ఎదురు దాడి చేయడం మా రెండో లక్ష్యమవుతుంది అని అన్నారు. 

Social Share Spread Message

Latest News