
సంగీత్ శోభన్, నయన్సారిక జంటగా నటించిన చిత్రం రాకాస.మానసశర్మ దర్శకురాలు. నిహారిక కొణిదెల నిర్మాత. ఈ నేపథ్యంలో సమ్మర్ ఫన్టాస్టిక్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఐపీఎల్ సీజన్లోనూ రాకాస సినిమాకు ఆదరణ దక్కడం చాలా గొప్ప విషయం. మంచి కామెడీ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. నేను ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ చూసి పగలబడి నవ్వాను. ఈ సినిమా దర్శకత్వం, నిర్మాణ బాధ్యతల్ని ఇద్దరు అమ్మాయిలు తీసుకొని బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారంటే వారిద్దరికీ హ్యాట్సాప్ అన్నారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్లీన్ ఫ్యామిలీ మూవీగా అందరినీ ఆకట్టుకుంటున్నదని, సమ్మర్లో మంచి సక్సెస్ సాధించడం ఆనందంగా ఉందని నిహారిక కొణిదెల చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.















