ఫ్రాన్స్ ఎన్నికల్లో వామపక్ష లేదా రైటిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే దేశంలో అంతర్యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ హెచ్చరించారు. తమ మధ్యేవాద పార్టీల కూటమి మాత్రమే ఈ పరిస్థితిని నివారించగలదని ఆయన పేర్కొన్నారు. రైట్ వింగ్ పార్టీగా ముద్రపడి నేషనల్ ర్యాలీ, వామపక్షవాద పార్టీ ఫ్రాన్స్ అన్‌బోవ్డ్ దేశంలో సామాజిక ఉద్రిక్తతలు పెంచేలా విభజన విధానాలను ప్రోత్సహిస్తున్నాయని మాక్రాన్ ఆరోపించారు. ఫ్రాన్స్ ఎన్నికల్లో మాక్రాన్ కూటమి వెనుకబడిందని ఓపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.