ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం ఆధారంగా తమిళంలో రూపొందిస్తున్న చిత్రం ఇళయరాజా. అగ్ర హీరో ధనుష్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చెన్నైలో ఘనంగా ప్రారంభ మైంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం. ఈ సందర్భంగా మాట్లాడిన ధనుష్ ఇళయరాజా పాటలను స్ఫూర్తిగా తీసుకొని తాను నటనలో రాణిస్తున్నానని తెలిపారు. ఇళయరాజా బయోపిక్‌లో నటించాలన్నది నా చిరకాల స్వప్నం. ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇళయరాజాకు నేను అభిమానిని కాదు. ఓ భక్తున్ని. ఆయన సంగీతం నటుడిగా నన్ను తీర్చిదిద్దింది. కెమెరా ముందుకు వెళ్లే ప్రతిసారి ఆయన సంగీతం వింటాను. నేను నటుడిగా ఎదగడం వెనక ఇళయరాజా సంగీతం ఇచ్చిన ప్రేరణ ఉంది అని చెప్పా రు. సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టే ముందు ఇళయరాజా జీవిత ప్రయాణానికి ఈ చిత్రం అద్దం పడు తుందని దర్శకుడు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధనుష్, కమల్‌హాసన్ పాల్గొన్నారు.