శర్వానంద్ హీరోగా నటించిన భారీ రేసింగ్ డ్రామా బైకర్. అభిలాష్‌రెడ్డి దర్శకుడు. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈపిఐక్యూ, 4డిఎక్స్, పిసిఎక్స్ ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు.

ట్రైలర్లో రేసర్‌గా శర్వానంద్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మెస్మరైజ్ చేసింది. ఇందులో శర్వానంద్‌కు తండ్రిగా, గురువుగా రాజశేఖర్ నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది. వారిద్దరి మధ్య భావోద్వేగాలు కథకు ప్రధానబలమని తెలుస్తోంది. మాళవిక నాయర్, అనురాగ్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరో రాజశేఖర్‌తో కలిసి నటించడం ఓ గొప్ప అనుభవమని, దర్శకుడు అభిలాష్ సినిమాను అద్భుతంగా తీశాడని శర్వా అన్నారు.

ఈ పాత్ర తనకు బాగా నచ్చిందని డా.రాజశేఖర్ చెప్పారు. శర్వాతో కలిసి నటించడం పట్ల ఆయన ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమాలోని ప్రతి రేస్ సీన్ వెనుక ఒక మంచి ఎమోషన్ ఉంటుందని దర్శకుడు అభిలాష్ తెలిపారు. ఇంకా దిల్‌రాజ, బన్నీవాసు, మాళవిక నాయర్, సంగీత దర్శకుడు జిబ్రాన్, డీవోపీ జె.యువరాజ్ కూడా మాట్లాడారు.















