భారత్, కెనడాలు విద్యాసంబంధిత అంశాలపై తాజాగా కీలక చర్చలు జరిపాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని బలపరిచేందుకు డ్యుయెల్ డిగ్రీల ప్రదానం, ఇరు దేశాల్లోని విద్యార్హతలకు పరస్పర గుర్తింపుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఆర్థిక వ్యవస్థకు యువత తోడ్పాటు కోసం క్యాంపస్‌ల ఏర్పాటుపై కూడా స్పందించారు. కామర్స్ మంత్రి పీయుష్ గోయల్ కెనడా పర్యటన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చాయి. కాగా, కెనడా నుంచి భారత్‌కు మరిన్ని పెట్టుబడులు రావాలని మంత్రి ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధిలో కెనడా వ్యాపారస్తులు భాగస్వాములు కావాలంటూ వారిని ఆహ్వానించారు. వస్తుల సేవల్లో క్వాలటీ మాత్రమే కాకుండా వాటి డెలివరీలోనూ భారత్ నాణ్యతను కోరుకుంటుందోని మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎర్లీ ప్రోగ్రస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో చర్చల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చల పునఃప్రారంభానికి ఇది మంచి సంకేతమని పేర్కొన్నారు. భారత్‌లో సుస్థిర వ్యాపారానుకూల వాతావరణం ఉంది అని కూడా మంత్రి పేర్కొన్నారు.


