సుమయ రెడ్డి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం డియర్ ఉమ. పృథ్వీ అంబర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సాయి రాజేశ్ మహాదేవ్ దర్శకత్వం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా డియర్ ఉమ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఇదొక ప్రేమ కావ్యం అని టీజర్ చూశాక అనిపించింది. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను అద్భుతంగా మలిచిన భావన కలుగుతుంది. నా క్షణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహం నీ చూపు, ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం, అబ్బాయిల ప్రేమలో స్వార్ధం ఉండదు.. అమ్మాయిల స్వార్దంలోనే ప్రేమ ఉంటుంది. అమ్మాయిలు ఇచ్చే షాకులకు అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్ వంటి డైలాగులు సిని మాలో డెప్త్‌ను చాటాయి. అందమైన ప్రేమ కథాచిత్రంగా రూపుదిద్దుకున్న డియర్ ఉమ షూటింగ్ పూర్త యిందనీ, త్వరలో విడుదల చేస్తామనీ దర్శకనిర్మాతలు చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాత: సుమయరెడ్డి, దర్శకత్వం: సాయి రాజేశ్ మహదేవ్.