Namaste NRI

అయోధ్యలో గర్భగుడిలోకి రాముని విగ్రహాన్ని చేర్చేది… ఆరోజే

అయోధ్య రామ‌మందిరంలో బాల‌రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ‌కు సంబంధించిన మ‌తాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్ర‌హాన్ని గ‌ర్భ‌గుడిలోకి చేర్చ‌నున్నారు. ఈ మేర‌కు రామ‌జ‌న్మ భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్ మాట్లాడుతూ రామ‌మందిరంలో విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ‌ కు సంబంధించిన మ‌తాచారాలు మంగ‌ళ‌వారం నుంచే ఆరంభం కానున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న రాముడి విగ్ర‌హాన్ని గ‌ర్భ‌గుడిలోకి చేర్చ‌నున్న‌ట్లు తెలిపారు. జ‌న‌వరి 22వ తేదీ మ‌ధ్యాహ్నం 12:20 గంట‌ల‌కు విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం ఉంటుందని వెల్ల‌డించారు. ఈ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు. వార‌ణాసికి చెందిన గ‌ణేశ్వ‌ర శాస్త్రి ద్ర‌విడ్ ముహుర్తా న్ని నిర్ణ‌యించార‌ని, ఆయ‌నే ఆచార వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌ధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events