Namaste NRI

ఎర్ర సముద్రంలో.. దేవర ఊచకోత

ఎన్టీఆర్‌ హీరో గా నటిస్తున్నచిత్రం దేవర. జాన్వీకపూర్‌ కథానాయిక. కొరటాల శివ దర్శకత్వం. ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, టామ్‌ షైన్‌ చాకో, నరైన్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణ లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరకర్త. ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. సముద్రం నేపథ్యంలోని పోరాట ఘట్టాలతో గ్లింప్స్‌ ఉత్కంఠగా సాగింది. ఎన్టీఆర్‌ రౌద్రరసపూరిత అభినయంతో ఆకట్టుకున్నారు. విజువల్స్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో కనిపించాయి. ఎర్ర సముద్రంలో ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ రక్తపాతం సృష్టి స్తూ ఫెరోషియస్‌ లుక్‌లో కనిపించారు ఎన్టీఆర్‌. ఈ సముద్రం చేపల కంటే రక్తాన్నే ఎక్కువగా చూసింది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events