నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం యు ఐ ద మూవీ. జి.మనోహరన్, కె.పిశ్రీకాంత్ నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడారు. ఇరవైఏళ్ల క్రితం నేను చేసిన సినిమాలను గుర్తుపెట్టుకొని ఇంకా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ కొత్త అనుభూతికి లోనుచేసే ఊహాప్రపంచం లాంటి సినిమా. టెక్నీషియన్స్ అందరూ నా విజన్‌కి సహకరించారు. రేష్మా అద్భుతంగా నటించింది. రీసెంట్‌గా సినిమా చూసినప్పుడు కన్నడ ఒరిజినలా? తెలుగు ఒరిజినలా? అనే డౌట్ వచ్చింది. అంత అద్భుతంగా అనువాదం కుదిరింది. మీరు మైథలాజికల్ కల్కి చూశారు. ఇందులో సైకలాజికల్ కల్కిని చూస్తారు. ఈ సినిమాను అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేస్తున్నారు అని తెలిపారు. అతిథులుగా విచ్చేసిన దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు అంబికా రామచంద్రరావు, ఎస్‌కేఎన్‌లు చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది.