రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన అయిదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణ పరిధిలో చేర్చాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ జనరల్ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ (టీజీఎస్జేఏసీ) కమిటీ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో ఆయన కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పోలవరం ముంపు ప్రాంతంగా భావించి ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురషోత్తపట్నం గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.