అమెరికా వాహనాల దిగ్గజం టెస్లాకు భారత ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లో టెస్లాకు కంపెనీ సంబంధిత ప్రోత్సహకాలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దిగుమతి సుంకంపై టెస్లాకు ఎలాంటి రాయితీలు ఉండబోవని, భవిష్యత్తులో అతి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్లా కంపెనీ ఈ ఏడాది జనవరిలో మన దేశంలోని బెంగళూరులో స్థానికంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇండియా అధిక దిగుమతి సుంకాలపై టెస్లా ఈసీవో ఎలన్ మస్క్ ట్వీటేసిన మరుసటి రోజే.. కేంద్రం నుంచి ఇలాంటి ప్రతికూల సంకేతాలు రావడం విశేషం.