75 ఏళ్ల స్వతంత్ర సంబరాల్లో భాగంగా భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక చరిత్ర సృష్టించింది. అమెరికా పశ్చిమ తీరానికి భారత యుద్ధనౌక తొలిసారి చేరుకుంది. దేశీయంగా నిర్మించిన ఐఎన్‌ఎస్ సాత్పురా, కాలిఫోర్నియా, శాన్ డియాగోలోని అమెరికా నేవల్ బేస్‌కు చేరుకుంది. ఇరు దేశాలు నేవీ, ఇతర అధికారుల సమక్షంలో ఆ యుద్ధ నౌకపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ రన్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఐఎస్‌ఎస్ సాత్పురా 75 రౌండ్లు తిరుగుతూ విన్యాసాలు చేస్తుంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకమైన 75 మంది ప్రముఖులను గుర్తు చేసుకుంటూ ప్రతి రౌండ్‌ను వారికి అంకితమిస్తుంది. కాగా, ఐఎన్‌ఎస్ సాత్పురా ఆరు ఖండాలు, మూడు మహా సముద్రాలు, ఆరు వేర్వేరు టైమ్ జోన్లలో స్మారక పర్యటనలు చేపట్టింది. చివరకు అమెరికా పశ్చిమ తీరానికి తొలిసారి చేరుకున్న భారత యుద్ధ నౌకగా చరిత్ర సృష్టించింది.