Namaste NRI

అమెరికా నివేదికను.. తోసిపుచ్చిన భారత్‌

భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని మత స్వేచ్ఛపై ఆమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఈ నివేదికను భారత్ తోసిపుచ్చింది. మత స్వేచ్ఛ పై అమెరికా విడుదల చేసిన నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అమెరికా నివేదికలో చాలా పక్షపాతం ఉందని, భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేకుండా అమెరికా ప్రత్యేక కథనాన్ని రూపొందించిందని జైస్వాల్‌ మండిపడ్డారు. భారతీయ న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఈ నివేదిక సవాలు చేసేలా కనిపిస్తోందని ఆయన అన్నారు.

అమెరికా నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది. భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేదు. కాబట్టి మేము దానిని తిరస్కరిస్తున్నాం. ఈ నివేదికలో ఆరోపణలు, తప్పుడు అంశాలు, అసత్యాలు, పక్షపాత మూలా లు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఏకపక్ష అంచనాల మిశ్రమం అని జైస్వాల్‌ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events