![](https://namastenri.net/wp-content/uploads/2024/08/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-117.jpg)
అమెరికా పర్యటనలో ఉన్న భారతీయ అంధ క్రికెట్ జట్టు అమెరికా దేశం డాలస్‌లోనే అతి పెద్ద మహాత్మా గాంధీ స్మారకస్థలిని సందర్శించారు. అనంతరం జాతిపిత గాంధీకి ఘన నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి తదితరులు వీరికి స్వాగతం పలికారు. బోస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్, బే ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా, ప్లేయర్స్ దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/08/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-123.jpg)