అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వం భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ సింగ్ జ్ఞాపకార్థం న్యూమాన్‌లోని హైవే-33కు ఆయన పేరు పెట్టింది. 2018లో అక్రమ వలసదారుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో రోనిల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. న్యూమాన్ పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తించిన రోనిల్ సింగ్‌కు స్థానికంగా మంచి పేరుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్టేట్ సెనెటర్, కౌంటీ సూపర్‌వైజర్, సహచర ఉద్యోగులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోనిల్ సింగ్‌కు ఘన నివాళి అర్పించారు. రోనిల్ సింగ్ కు భార్య అనామిక, కుమారుడు ఆర్నవ్ ఉన్నారు.
