Skip to main content

Namaste NRI

కాలిఫోర్నియా హైవేకి భారత అధికారి పేరు

 అమెరికాలోని  కాలిఫోర్నియా ప్రభుత్వం భారత సంతతి పోలీస్‌ అధికారి రోనిల్‌ సింగ్‌ జ్ఞాపకార్థం న్యూమాన్‌లోని హైవే-33కు ఆయన పేరు పెట్టింది. 2018లో అక్రమ వలసదారుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో రోనిల్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయారు. న్యూమాన్‌ పోలీస్‌ విభాగంలో విధులు నిర్వర్తించిన రోనిల్‌ సింగ్‌కు స్థానికంగా మంచి పేరుంది.  ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్టేట్‌ సెనెటర్‌, కౌంటీ సూపర్‌వైజర్‌, సహచర ఉద్యోగులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోనిల్‌ సింగ్‌కు ఘన నివాళి అర్పించారు. రోనిల్‌ సింగ్‌ కు భార్య అనామిక, కుమారుడు ఆర్నవ్‌ ఉన్నారు.

Social Share Spread Message

Latest News