Namaste NRI

అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్‌

స్కాలర్‌షిప్‌ కోసం బతికున్న తండ్రి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సమర్పించిన భారత్‌కు చెందిన ఒక విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 19 ఏండ్ల ఆర్యన్‌ ఆనంద్‌ గత ఏడాది నకిలీ సర్టిఫికెట్లతో లేహీ వర్సిటీలో ప్రవేశం పొందాడు. స్కాలర్‌ షిప్‌ కోసం తన తండ్రి బతికి ఉన్నప్పటికీ మరణించినట్టు డెత్‌ సర్టిఫికెట్‌ సమర్పించాడు. అయితే నకిలీ సర్టిఫికెట్‌లతో అమెరికా వర్సిటీలో ఎలా సీటు తెచ్చుకుంది, తన తండ్రి చనిపోయాడని అబద్ధం చెప్పి స్కాలర్‌షిప్‌ తెచ్చుకున్న వైనాలన్నీ వివరిస్తూ అబద్ధాలతోనే నా జీవితం, కెరీర్‌ను నిర్మించుకున్నా పేరుతో రెడ్డిట్‌లో అతడు చేసిన పోస్టే అతడిని పట్టించింది. దీంతో ఏప్రిల్‌ 30న ఆనంద్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై ఆరోపణలకు జీవితకాల శిక్ష పడుతుంది. అయితే అతడు నార్తంప్టన్‌ కౌంటీ జైలులో ఒకట్రెండు నెలలు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టి స్వదేశానికి పంపనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress