విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆయన విధిస్తున్న ఆంక్షలు ఇండియన్ స్టూడెంట్స్ డాలర్ డ్రీమ్స్ ను కల్లలుగా మారుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

ఆంక్షల నడుమ తమ బిడ్డలను అమెరికాకు పంపించి డబ్బును పోగొట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. ఉన్నత విద్య కోసమని రిస్క్ చేసి అమెరికాకు పంపించడం కంటే యూకే, జర్మనీ తదితర దేశాలకు పంపించడం మంచిదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు వెళ్లే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్లు అంతకంతకూ తగ్గుతున్నట్టు పలు కన్సల్టెన్సీలు చెప్తున్నాయి.
