Namaste NRI

అమెరికాలోని భారతీయులు జాగ్రత్త … ఇంద్రానూయి కీలక  సూచనలు

అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్న విద్యార్థుల హత్యలు, అదృశ్యం కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మన దేశ విద్యార్థులకు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి కీలక సూచనలు చేశారు. ఈ సంద ర్భంగా ఇంద్రానూయి మాట్లాడుతూ స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. ఈ మధ్య కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర సంఘటనల గురించి తెలిసింది. ఇక్కడి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. రాత్రి సమయంలో చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దు. మాదకద్రవ్యాల కు దూరంగా ఉండండి. అతిగా మద్యం సేవించకండి. ఇవన్నీ విపత్తుకు దారితీసేవే. అమెరికాకు వచ్చిన కొత్తలో స్నేహితులు, అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి.

కఠోర శ్రమ, విజయానికి భారతీయ విద్యార్థులు చిరునామా. అదే సమయంలో కొందరు డ్రగ్స్‌కు బానిసలవుతు న్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కెరీర్‌ పాడవుతుంది. వీసా స్టేటస్‌ గురించి తెలుసుకుంటూ ఉండండి. పార్ట్‌టైం ఉద్యోగం విషయంలో చట్టబద్ధతను తెలుసుకోండి. అమెరికాలో విదేశీ విద్యార్థిగా మీ హద్దులు గుర్తుంచుకోవాలి  అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events