Namaste NRI

భారత్ బ‌డ్జెట్‌..రెండు దేశాల సంబంధాలు బలోపేతం అవుతాయి

భారత్ బ‌డ్జెట్‌ను  ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని తాలిబన్లు స్వాగతించారు. ఆఫ్ఘనిస్థాన్కు సాయం అందిస్తామని బడ్జెట్లో చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని వారు తెలిపారు. భారత్ బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు తాలిబన్ సంప్రదింపుల కమిటీ మాజీ సభ్యుడు సుహైల్ షాహిన్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి భారత్ అందజేస్తున్న మద్దతును అభినందిస్తున్నాం. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, నమ్మకం, విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయని  తెలిపారు.

2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత, ఆఫ్ఘన్-భారత్ మధ్య సంబంధాలు దెబ్బ తింటాయని, భారత్ మద్దతుతో చేపట్టిన ప్రాజెక్టులు నిలిచిపోతాయని భావించారు. ఆఫ్ఘనిస్థాన్లో పలు ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్టుల పనులు భారత్ ప్రారంభిస్తే, రెండు దేశాల మధ్య సంబంధాల వృద్ధికి దోహద పడుతుంది. అపనమ్మకాలు తొలగిపోతాయి  అని సుహైల్ షాహిన్ అన్నట్లు సమాచారం.

ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి సహాయ ప్యాకేజీ కింద 2023-24 ఆర్థిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.200 కోట్ల (25 మిలియన్ డాలర్లు) నిధిని కేటాయిస్తామని ప్రకటించారు. తాలిబన్ల ఆధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్ వెళ్లిపోయిన తర్వాత ఆ దేశానికి భారత్ వరుసగా రెండో ఏడాది సహాయ ప్యాకేజీనిస్తున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events