
చైనాలోని వాణిజ్య నగరమైన షాంఘైలో అధునాతన కాన్సులేట్ భవనాన్ని భారత్ ప్రారంభించింది. ఆ నగరంలో భారత్ కు చెందిన అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. అక్కడి భారత వ్యాపార వేత్తలకు సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. చాగ్నంగ్ జిల్లాలో ప్రఖ్యాత డానింగి సెంటర్లో ఈ కొత్త కాన్సులేట్ ఏర్పాటు అయింది.గతంలో ఉన్న భవనంతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణంలో వుంటుంది.చైనా లో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ దీన్ని ప్రారంభించారు.















