గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా గేమ్ ఆన్. రవి కస్తూరి నిర్మిస్తున్నారు. దయానంద్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. విశ్వక్సేన్ మాట్లాడుతూ షార్ట్ ఫిలింస్ చేస్తున్న టైమ్ నుంచీ నేనూ దయానంద్ మిత్రులం. ఇప్పుడు వారి సినిమా రిలీజ్‌కు వస్తుందంటే సంతోషంగా ఉంది. టీజర్ చూశాను బాగుంది. ఇక్కడికి నిత్యం కొత్తవాళ్లు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉంటారు. అలా గీతానంద్‌కు హీరోగా పేరు రావాలి అన్నారు. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ సినిమాను ఏడాది పాటు కష్టపడి నిర్మించాం. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రమిది. ఇలాంటి మూవీ చూసి ఉండరనే నమ్మకంతోనే రూపొందించాం అని చెప్పారు. హీరో గీతానంద్ మాట్లాడుతూ ఫెయిల్యూర్ వ్యక్తి జీవితంలో చివరి దశలో ఒక గేమ్ మొదలైతే, అది అతన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుంది, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు.
