ఇజ్రాయెల్ తో ఉద్రిక్త పరిస్థితుల వేళ అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ అణుబాంబు తయారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అయితే, అవసరమైతే మాత్రం తమ దేశం అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.
ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకూ అణుబాంబు తయారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం మా సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుంది. మా అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడిచేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయ్ అని ఆయన హెచ్చరించారు.