ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చీఫ్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అయితే, అతడి మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. పాక్పోర్ ఇరాన్‌లో కీలక నేత. ఆయన ఐఆర్‌జీసీకి 260 రోజులుగా నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు అతడు మేజర్ జనరల్‌గా ఉండేవారు. గతేడాది అతడిని ఐఆర్‌జీసీ చీఫ్‌గా నియమిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ 2025లో ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఈ స్థానంలో ఉన్న హుసేన్ సలామి కొనసాగాడు. హుసేన్ మరణం తర్వాత పాక్పోర్ బాధ్యతలు తీసుకున్నాడు. ఐఆర్‌జీసీ బలోపేతమే లక్ష్యంగా అతడు పని చేశాడు.

గత నెలలో పాక్పోర్ అమెరికా, ఇజ్రాయెల్‌కు సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశాడు. తమను తక్కువగా అంచనా వేయొద్దని, గతంలోకంటే ఇప్పుడు తమ దేశం ఇంకా బలంగా ఉందన్నాడు. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ, ఆయన ఈ దాడి నుంచి బయటపడ్డారు. దాడి సమయంలో ఖమేనీ ఆయన నివాసం వద్ద లేరని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నారు. మరోవైపు తాజా దాడులపై ఇరాన్ స్పందించింది. తాము ఇప్పటివరకు పనికిరాని మిస్సైల్స్ మాత్రమే ప్రయోగించామని, నిజమైన, ఊహకందని మిస్సైల్స్ ప్రయోగిస్తే అమెరికా తట్టుకోలేదని హెచ్చరించింది.















