ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఉపయోగపడే, నేరాలను అరికట్టే చట్టాలను అమల్లోకి తెస్తారు. అయితే, జపాన్ ప్రభుత్వం మాత్రం ప్రతి రోజూ అందరూ నవ్వాలని చట్టం తీసుకొచ్చింది. యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం లాఫింగ్ లాని తీసుకొచ్చింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవ్వడం ఆరోగ్యానికి మంచిది అంటారు. ఈ క్రమంలో యమగట విశ్వ విద్యాలయంలోని ఫ్యాక్టరీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనల్లో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలింది. ఈ పరిశోధన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రోజులో ఒక్కసారి తప్పకుండా నవ్వాలని చట్టం తీసుకొచ్చింది. పని ప్రదేశంలో నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను కూడా ఆదేశించడం విశేషం. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని సూచించింది.