అమెరికా సైనిక సహాయాన్ని నెలల తరబడి నిలిపివేసినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటి సారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి క్షమాపణ తెలియజేశారు. ఆ జాప్యం వల్ల యుద్ధ రంగంలో రష్యా ముందంజ వేయగలిగింది. డి- డే చేరవేతల 80వ వార్షికోత్సవం సందర్భంగా పారిస్‌లో జరిగిన కార్యక్రమాలకు బైడెన్, జెలెన్‌స్కీ ఇద్దరూ హాజరయ్యారు.
పారిస్‌లో బైడెన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ కోసం బైడెన్ ప్రతిపాదిత 61 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే సైనిక సహాయం ప్యాకేజిని పంపించే ముందు కాంగ్రెస్ ఆరు మాసాల పాలు వేచి ఉండగా మరింత సహాయం వస్తుందా అన్నది వారాల తరబడి తెలియని స్థితిలో ఉంచినందుకు ఉక్రెయిన్ ప్రజలకు తాను క్షమాపణ చెప్పినట్లు జెలెన్‌స్కీకి తెలిపారు. అయినప్పటికీ సుదీర్ఘ పోరులో ఉక్రెయిన్ పక్షాన అమెరికన్ ప్రజలు ఉన్నారని బైడెన్ స్పష్టం చేశారు. మేము ఇంకా ఉన్నాం. పూర్తిగా. మొత్తంగా అని బైడెన్ చెప్పారు.