Namaste NRI

జో బైడెన్ కీలక నిర్ణయం

 వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ దేశంలోని మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునే దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. అమెరికాలోని 44 రాష్ట్రాల్లో కొత్త కొలువులకు కాలేజీ డిగ్రీ తప్పనిసరి కాదని ప్రకటించబోతున్నారు. ఇదే జరిగితే అమెరికన్ల కంటే భారతీయులకు ఎక్కువ లబ్ధి చేకూరనున్నది. 2022-23లో న్యూ స్టాన్ఫర్డ్ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో 12వ తరగతి వరకు అడ్మిషన్లు 12 లక్షల్లోపే. కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన అమెరికన్లు కేవలం నాలుగో వంతు మంది మాత్రమే ఉంటారు. ప్రతియేటా అమెరికాలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులు పూర్తి చేస్తున్న వారు సుమారు 2.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే ఇండియన్ విద్యార్థులు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.

డెల్లాయిట్ అధ్యయనం అమెరికా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో  2030 నాటికి 21 లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయని తెలుస్తున్నది. దీంతో తయారీ రంగం పట్ల అమెరికన్లు విసుగెత్తిపోతున్నారు. అమెరికా విమానాలయ తయారీ సంస్థ బోయింగ్ వద్ద 220 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ డీల్ ఆధారంగా మధ్యతరగతి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామన్న హామీతో ఓట్లు పొందేందుకు జో బైడెన్ వ్యూహ రచన చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events