Namaste NRI

కొత్త చట్టంపై సంతకం చేసిన జో బైడెన్‌

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. కొందరు ఉన్మాదులు సృష్టిస్తున్న ఘోర కలికలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది. ఈ ఘటనల్లో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు సైతం ఈ సంస్కృతికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుపాకీ సంస్కృతిని అంతం పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు హింసకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

ఈ విషయాన్ని అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. అమెరికాలో వ్యాధులు, ప్రమాదాల వల్ల మృతి చెందుతున్న చిన్నారుల కంటే, తుపాకీల కారణంగా చోటుచేసుకుంటున్న మృతుల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హింసను అంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పై సంతకాలు చేసినట్లు బైడెన్‌ వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events