Namaste NRI

రూ.1000 కోట్ల క్లబ్‌లోకి కల్కి.. అరుదైన రికార్డు

ప్రభాస్‌ కల్కి 2898ఏడీ సినిమా వెయ్యికోట్ల మైలురాయిని చేరుకుంది. టాలీవుడ్‌లో రూపొందిన పానిండియా సినిమాల్లో వెయ్యికోట్ల మైల్‌స్టోన్‌ని చేరుకున్న మూడో సినిమాగా కల్కి 2898ఏడీ నిలిచింది. బాహుబలి 2 18వందల కోట్ల పై చిలుకు వసూళ్లను సాధించి టాలీవుడ్‌ నంబర్‌వన్‌ మూవీగా నిలువగా, రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ దాదాపు 12వందలకోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్రభాస్‌ కల్కి 2898ఏడీ మూడోవారానికే వెయ్యికోట్ల మైలురాయి చేరుకోవడమే కాక, ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. ప్రభాస్‌ కెరీర్‌లో వెయ్యికోట్ల మైలురాయి చేరుకున్న రెండో సినిమా కల్కి 2898ఏడీ. ఇప్పటికే పలు ప్రాంతాలో ఈ సినిమా నాన్‌ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసిందని మేకర్స్‌ చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News