Namaste NRI

సూర్య పుట్టిన రోజు సందర్భంగా కంగువ ఫస్ట్ సింగిల్

సూర్య నటిస్తున్న పాన్‌ఇండియా సినిమా కంగువ. దిశా పటాని కథానాయిక.  ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా కు సంబంధించిన మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ని మేకర్స్‌ ప్రారంభించారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లోని తొలిపాటను మేకర్స్‌ విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను, దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఆది జ్వాల.. అనంత జ్వాల.. వైర జ్వాల.. వీర జ్వాల.. దైవ జ్వాల.. దావాగ్ని జ్వాల  అంటూ సాగే ఈ పాటలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపిస్తున్నారు.

దర్శకుడు శివ ఈ సినిమాను పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్‌వారు తెలుగులో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. యోగిబాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.  అక్టోబర్‌ 10న దసరా కానుకగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events