Namaste NRI

కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప టీం సందడి

టాలీవుడ్‌ యాక్టర్‌ మంచు విష్ణు‌ అండ్‌ మోహన్‌ బాబు టీం నుంచి వస్తోన్న తొలి పాన్‌ ఇండియా సినిమా కన్నప్ప. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. బాలీవుడ్‌ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌ కుమార్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా కన్నప్ప టీం కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేసింది. కన్నప్ప టీజర్‌ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత అంతర్జాతీయ పంపిణీదారులు, ప్రేక్షకులతోపాటు టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరి నుండి విశేషమైన సానుకూల స్పందన వచ్చినట్టుంది. విష్ణు, మోహన్‌ బాబు, ప్రభుదేవా, వెరోనికా బ్లాక్ అండ్ వైట్‌ కాస్ట్యూమ్స్‌లో రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు.

 తాజా అప్‌డేట్ ప్రకారం కన్నప్ప తెలుగు టీజర్‌ మే 30న హైదరాబాద్‌లోని ఓ పాపులర్‌ థియేటర్‌లో స్క్రీనింగ్ కానుంది. జూన్‌ 13న టీజర్‌ను డిజిటల్‌గా లాంఛ్ చేయనున్నారు.  విష్ణు చేతిలో ఖడ్గం పట్టుకొని సమరంలో ఉన్న కన్నప్ప పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. క్లాస్‌, మాస్‌, యాక్షన్‌ హీరోగా పాపులారిటీ సంపాదించిన బాలీవుడ్ యాక్టర్‌ అక్షయ్‌కుమార్‌ కన్నప్పలో కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress