Namaste NRI

కార్తికేయ సూపర్‌ స్టార్‌ అవుతాడు.. శర్వానంద్‌

కార్తికేయ కథానాయకుడిగా రూపొందిన చిత్రం భజేవాయువేగం. ఐశ్వర్య మీనన్‌ కథానాయిక. ప్రశాంత్‌రెడ్డి దర్శకుడు. ప్రతిష్టాత్మక యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్‌ యు/ఏ సర్టిఫికెట్‌ పొందినది. నేడు (శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన శర్వానంద్‌  మాట్లాడుతూ కార్తికేయ ఆల్‌రౌండ్‌. యాక్షన్‌, ఎమోషన్‌, కామెడీ అన్ని జానర్స్‌ చేయగల నటుడు. తను తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడు అని హీరో శర్వా నంద్‌ నమ్మకం వెలిబుచ్చారు.  ఈ టీమ్‌లో చాలామందితో పనిచేశాను. దర్శకుడు ప్రశాంతే ఈ సినిమాకు నిజమైన హీరో. తనెప్పుడు మాస్‌ మాస్‌ అని కలవరిస్తాడు. ఆ తరహా కథలే రాస్తాడు. తను రన్‌ రాజా రన్‌  డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. అప్పుడే అనుకున్నా ఇతను పెద్ద డైరెక్టర్‌ అవుతాడని. కచ్చితంగా అందరూ మెచ్చే సినిమాగా ఈ  భజే వాయువేగం నిలుస్తుంది అని శర్వానంద్‌ నమ్మకంగా చెప్పారు.

 ఎలాంటి కథకోసం ఇన్నాళ్లూ ఎదురు చూశానో, అలాంటి కథే భజేవాయువేగం. ముందు దర్శకుడు ప్రశాంత్‌రెడ్డికి థ్యాంక్స్‌. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత ఆ స్థాయి విజయం రాలేదు. ఆ లోటు ఈ సినిమా తీర్చేస్తుంది అని కార్తికేయ అన్నారు. అన్నీ కుదిరిన సినిమా భజేవాయువేగం అని చెబుతూ.. సహకరించిన అందరికీ దర్శకుడు ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అతిథులుగా విచ్చేసిన మేర్లపాక గాంధీ, వశిష్ఠ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్రయూనిట్‌ సభ్యులంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events