గజ్వేల్ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.