ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కుటుంబ సమేతంగా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. తల్లితండ్రులు, భార్యతో కలిసి కొత్తగా కొలువైన రామ్‌లల్లాను దర్శించుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయోధ్యకు చేరుకున్న రాముడి దివ్యదర్శనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తన కుటుంబంతో రాముడిని దర్శించుకున్నట్లు కేజ్రీ తెలిపారు. దర్శనం తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. చెప్పలేనటువంటి అనుభూతికి లోనైనట్లు ఆయన వెల్లడించారు. మనస్సు ప్రశాంతంగా మారినట్లు చెప్పారు. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారిలో ఉన్న ప్రేమ, భక్తిని చూస్తుంటే మనస్సుకు సంతోషం వేస్తోందన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రామ్‌లల్లాను ప్రార్థించినట్లు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/02/GGITBzzW4AAmm6Q-1024x682.jpg)