వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని సీజేఐ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు మత్స్యకారులు, రైతులతో పాటు సమాజం లోని అత్యంత అట్టడుగు వర్గాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం అక్టోబర్, డిసెంబర్‌లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రంతో పాటు పౌరులు కలిసి పని చేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. నిన్న గోవాలో వర్షాలు కురిశాయని, నారాలి పౌర్ణమి రోజున మత్స్యకారులు సముద్రాని కి కొబ్బరికాయలు సమర్పిస్తే వర్షాలు ముగుస్తాయని చిన్నప్పుడు చెప్పేవారన్నారు. కానీ, అక్టోబర్, డిసెంబర్‌లో వర్షాలు కురుస్తున్నాయన్నారు.