కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఎపిహైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని నిందితుడికి తెలిపింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతీ ఆదివారం ముమ్మి డివరం పిఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది. శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఈరోజు తీర్పును వెలువరించింది. గత ఐదేళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల కాలంలో సాక్షం చెప్పేందుకు సీఎం జగన్ ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరుకాక పోవడం గమనార్హం. 2018, అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి కేసు లో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.