Namaste NRI

క్రాంతి మాధవ్‌ కొత్త సినిమా ప్రారంభం

నటుడు చైతన్యరావు మదాడి, ఐరా, సాఖీ హీరోహీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం హైదరాబాద్‌ లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. చిత్ర నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్‌.వి స్క్రిప్ట్‌ని దర్శకుడు క్రాంతిమాధవ్‌కు అందజేయగా, తొలి సన్నివేశానికి ముళ్లపూడి వర గౌరవ దర్శకత్వం వహించారు. అతిథులంతా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తన మళ్లీ మళ్లీ ఇది రానిరోజు తరహాలోనే ఇదికూడా ప్రేమకథేనని, అందమైన లొకేషన్లలో భారీగా చిత్రాన్ని నిర్మించనున్నామని క్రాంతిమాధవ్‌ తెలిపారు. చిత్రంలో భాగమైనందుకు హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. దర్శకుడు క్రాంతిమాధవ్‌ చెప్పే కథలంటే తనకెంతో ఇష్టమని నిర్మాత పూర్ణ నాయుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.వి.జ్ఞానశేఖర్‌ వీఎస్‌., సంగీతం: ఫణి కల్యాణ్‌.

Social Share Spread Message

Latest News