తెలంగాణ రాష్ట్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తొంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్యనేత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చ జరిగినపుడు కేటీఆర్ అంత సానుకూలత చూపలేదు. అలా అని వ్యతిరేకించలేదు. కేసీఆర్ తీసుకొనే తుది నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేటీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. దీనివల్ల జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌కు ప్రాధాన్యం వస్తుందని భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్యా లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని బీఆర్‌ఎస్ భావిస్తోంది.