Namaste NRI

ఆస్ట్రేలియాలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్‌, అడిలైడ్ పట్టణాలలో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మెల్‌బోర్న్ లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా  వినయ్ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో వినయ్ సన్నీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ ఎంతో చురగ్గా పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడినా, గెలిచినా బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ ఎప్పటికీ పార్టీతోనే ఉంటుందని స్పష్టం చేశారు.

 ఈ వేడుకలలో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు ప్రవీణ్ లేదెళ్ల, ఉదయ్ సింహా రెడ్డి ,సాయి కృష్ణ కల్వకుంట్ల, రాకేష్, సూర్య రావు, అశోక్, బాలరాజు, వేణు నాథ్, సాయి యాదవ్, మిస్కీన్, తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events