విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. పూర్తి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అన్య పాండే కథానాయిక. మైక్ టైసన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇటీవలే విడులైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో వాట్ లగా పాటని విడుదల చేశారు. మేము భారతీయులం. ఎవరికీ తీసిపోం అంటూ పాటలో విజయ్ శక్తిమంతమైన సంభాషణలు వినిపించారు. మిక్స్డ్ మార్సల్ ఆర్ట్స్ ఆట నేపథ్యంగా సాగే కథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు విజయ్. ఈ సినిమాకి కూర్పు: జునైద్ సిద్దిఖీ, స్టంట్స్: కేచ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.