Skip to main content

Namaste NRI

లైగర్‌ నుంచి వాట్‌ లాగా సాంగ్ విడుదల

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించారు. పూర్తి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అన్య పాండే కథానాయిక.  మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇటీవలే విడులైన ట్రైలర్‌ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది.  ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో వాట్‌ లగా పాటని విడుదల చేశారు. మేము భారతీయులం. ఎవరికీ తీసిపోం అంటూ పాటలో విజయ్‌ శక్తిమంతమైన సంభాషణలు వినిపించారు. మిక్స్డ్‌ మార్సల్‌ ఆర్ట్స్‌ ఆట నేపథ్యంగా సాగే కథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు విజయ్‌. ఈ సినిమాకి కూర్పు: జునైద్‌ సిద్దిఖీ, స్టంట్స్‌: కేచ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News