
అమెరికా విద్యాశాఖ మంత్రిగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ సహ వ్యవస్థాపకురాలు లిండా మెక్‌మహన్ ను దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ నియమించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా చేసిన సమయంలో చిన్న తరహా వాణిజ్య శాఖకు మెక్‌మహన్ పనిచేశారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం ఆమె మిలియన్ల డాలర్లు విరాళం ఇచ్చారు. ట్రుత్ సోషల్ మీడియాలో లిండా ఓ పోస్టు చేశారు. దశాబ్ధాల తన నాయకత్వ అనుభవాన్ని విద్యా, వ్యాణిజ్య వృద్ధి కోసం వాడనున్నట్లు ఆమె చెప్పారు. రాబోయే తరానికి చెందిన అమెరికా విద్యార్థులను, కార్యకర్తలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
