రామ్, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చిట్టి పొట్టి. స్వీయ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నచెల్లెలి అనుబంధం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. మూడు తరాల్లో చెల్లెలుగా, మేనత్తగా, బామ్మగా ఒక ఆడబిడ్డకు పుట్టింటిపై ఉన్న ప్రేమ, మమకారాన్ని తెలిపే చిత్రమిది. కుటుంబ భావోద్వేగాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: శ్రీవెంకట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి.