Namaste NRI

ప్రేమికుల సమస్యలకు.. లవ్‌ గురు పరిష్కారాలు

విజయ్‌ ఆంటోనీ  హీరోగా నటించి, నిర్మించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ లవ్‌ గురు. మృణాళిని రవి కథానా యిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకుడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ ఆంటోనీ మాట్లాడారు. 95శాతం మందికి లవ్‌ప్రాబ్లమ్స్‌ ఉంటాయి ముఖ్యంగా అబ్బాయిలకు. ఈ లవ్‌ గురు  సినిమా చూస్తే అమ్మాయిలను ఎలా హ్యాండిల్‌ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను లవ్‌ గురులా సలహాలిస్తా అంటున్నారు.  ఇందులో నేను కూడా లీల అనే అమ్మాయితో సమస్యలను ఎదుర్కొంటాను. వాటి నుంచి ఎలా బయటపడ్డానన్నది ఫన్నీగా ఉంటుంది. స్క్రిప్ట్‌ ఈ సినిమాకు ప్రధాన బలం. తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 600 థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని చెప్పారు.

బిచ్చగాడు లా  లవ్‌గురు కూడా విజయ్‌ ఆంటోనీ కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇందులో లీల అనే పాత్ర చేశానని, ఈ పాత్ర కోసం ట్రైనింగ్‌ కూడా తీసుకున్నానని, ఈ సినిమా తర్వాత విజయ్‌ ఇమేజ్‌ మారుతుందని, సంగీతం, సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయని హీరోయిన్‌ మృణాలిని రవి తెలిపారు. ఇంకా రచయిత భాష్యశ్రీ కూడా మాట్లాడారు. రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌ 11న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: ఫరుక్‌ జె.భాష, సంగీతం: భరత్‌ ధనశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events