నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న చిత్రం 18 పేజిస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందిస్తున్నారు. ఈ చిత్రంలోని నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చెను గా అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. నిర్మాత మాట్లాడుతూ గోపీసుందర్ చక్కటి స్వరాల్ని సమకూర్చారు. తాజాగా విడుదల చేసిన ఈ పాట మెలోడి సాంగ్‌గా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : శరణ్ రాపర్తి, అశోక్ బండ్రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.