Namaste NRI

18 పేజిస్‌ నుండి నన్నయ్య రాసిన  లిరికల్‌ సాంగ్‌ 

నిఖిల్‌ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న చిత్రం 18 పేజిస్‌. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మాణంలో బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు.  ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథను అందిస్తున్నారు. ఈ చిత్రంలోని నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చెను గా అనే లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.  నిర్మాత మాట్లాడుతూ  గోపీసుందర్‌ చక్కటి స్వరాల్ని సమకూర్చారు. తాజాగా విడుదల చేసిన ఈ పాట మెలోడి సాంగ్‌గా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు : శరణ్‌ రాపర్తి, అశోక్‌ బండ్రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా  డిసెంబర్‌ 23న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News